ఏపీలో వైసీపీ తరఫున 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో మైలవరం నేత వసంత కృష్ణప్రసాద్ ఒకరు. అదీ వైసీపీలో గెలిచిన అతి కొద్ది మంది కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేల్లో కూడా ఒకరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్ వ్యాపార భాగస్వామి, కేసుల్లో కూడా భాగస్వామి అయిన వసంత కూడా ఒకరు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి ఇవాళ గుడ్ బై చెప్పేయబోతున్నారు.
మైలవరంలో ఓవైపు తనకు లైన్ క్లియర్ అంటూనే మంత్రి జోగి రమేష్ కు ఈ నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యానికి అనుమతించడం, స్ధానికంగా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నుంచి పెరుగుతున్న ఒత్తిడి, అధిష్టానం తన మాటకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి కారణాలతో వసంత కృష్ణప్రసాద్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు జగన్ తో కలిసి చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరిగా వైసీపీకి గుడ్ బై చెప్పేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్ కు టీడీపీలో ఎమ్మెల్యే సీటు ఆఫర్ ఉంది. దీంతో ఆయన ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పడానికి గల కారణాలను వివరించి టీడీపీలో చేరికపై కీలక ప్రకటన చేయబోతున్నారు. అనంతరం ఆయన టీడీపీలో లాంఛనంగా చేరడం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం చకచకా జరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వసంత టీడీపీలోకి వస్తే గతంలో మైలవరంలో గెలిచిన దేవినేని ఉమకు మరో నియోజకవర్గం కేటాయించేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది.
Social Plugin