Ticker

6/recent/ticker-posts

HDFC Bank: ఇన్వెస్టర్లకు డబుల్ బొనాంజా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..


 RBI News: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగుతున్నప్పటకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి ఒక వార్త మాత్రం ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపుతోంది. బ్యాంక్ నిర్ణయానికి రిజర్వు బ్యాంక్ ఆమోదం కూడా రావటంతో మరో రెండు కంపెనీల షేర్లు భారీగా లాభపడనున్నాయి.


వివరాల్లోకి వెళితే దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ ఇండస్ ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ కంపెనీల్లో అదనంగా 9.5 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ అనుమతి లభించింది. వాటాలను కొనుగోలు చేయడానికి ఆమోదం హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా పెట్టుబడుల కోసం ఉద్దేశించబడింది. ప్రస్తుతం పొందిన ఆమోదం ఏడాది వరకు చెల్లుబాటులో ఉండనుంది. ఆ తర్వాత రద్దవుతుంది.


RBI ఆమోదం అనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, జనవరి 16, 2023 నాటి బ్యాంకింగ్ కంపెనీలలో షేర్లు లేదా ఓటింగ్ హక్కులను పొందడం, హోల్డింగ్ చేయడంపై RBI మాస్టర్ డైరెక్షన్ & మార్గదర్శకాలు, ఫెమా, సెబీ నిబంధనలకు లోబడి ఉంటుంది. రిజర్వు బ్యాంక్ ఆమోదం ప్రకారం ఇకపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ ఇండస్ఇండ్ లో మెుత్తంగా 9.5 శాతం వాటాలకు మించకుండా ఎల్లప్పుడూ చూసుకోవాల్సి ఉంటుంది.


హోల్డింగ్ సరళి ప్రకారం ప్రమోటర్లు ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఇండస్ఇండ్ లిమిటెడ్ కలిసి బ్యాంకులో 16.45 శాతం వాటాను కలిగి ఉన్నాయి. డిసెంబర్ 2023 నాటికి మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్‌లో కలిపి 15.63 శాతం వాటాను కలిగి ఉండగా, ఎల్‌ఐసితో సహా బీమా కంపెనీలు 7.04 శాతం వాటాను కలిగి ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికం నాటికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కలిసి 38.24 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు.


ఇదే క్రమంలో యెస్ బ్యాంక్ హోల్డింగ్ విధానం ప్రకారం 100 శాతం వాటాలు ప్రజల వద్ద ఉన్నాయి. రుణదాతల్లో ఎల్ఐసీతో 4.34 శాత వాటా కలిగి ఉండగా.. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్‌ కన్సార్టియం 37.23 శాతం వాటాను కలిగి ఉంది.