వాహనదారుడు తమ ప్రాణాలేకాకుండా కుటుంబ సంక్షేమాన్ని గుర్తించుకోవాలి...
వాహనదారుడు రోడ్డు భధ్రత నియమాలను పాటించాలి...
ఏలూరు: రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్ ధరించడం ద్విచక్రవాహన దారులకు క్షేమమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె. రత్నప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం స్ధానిక జిల్లా కోర్టు ఆవరణలోవున్న జిల్లా న్యాయసేవాధికార సంస్ధ భవనంలో ట్రాఫిక్, ట్రాన్స్ ఫోర్ట్ అధికారులైన ట్రాఫిక్ సిఐ కె. శ్రీనివాసరావు, ఆర్టిఓ కె. శ్రీహరి లతో కలిసి హైకోర్టు ఆదేశాలను అనుసరించి ద్విచక్ర వాహనదారుల భధ్రతకు సంబంధించి పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె. రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 3703 మంది రోడ్డు ప్రమాదాలకు గురై మరణించినవారిలో 3042 మంది హెల్మెట్ ధరించకపోవడం కారణమని తెలిపారు. వాహనదారులు రోడ్డు భధ్రతా నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ హెల్మెట్ ను ధరించి ప్రయాణం చెయ్యాలని తెలిపారు. మరి ముఖ్యంగా యువత ద్విచక్రవాహనం అతివేగంగా నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి మరణించడం జరుగుతుందని తెలిపారు. కుటుంబ యజమాని, యువత, మరి ముఖ్యంగా విద్యార్ధులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆకుటుంబానికి తీరని నష్టం జరుగుతుందని . అతివేగం ప్రాణానికి ముప్పుని తెలుసుకుని వాహన నడపాలన్నారు.
రోడ్డు భద్రత నియమాలకు, ప్రమాదాలకు సంబంధించి విరివిగా ప్రచారం కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, సంబంధిత ట్రాన్స్ పోర్టు, పోలీస్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేసి హెల్మెట్ లేనివారిపై కేసులు నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. రూల్ 167 ప్రకారం రోడ్డు భధ్రతకు సంబందించి ఎలక్ట్రానిక్ పరికరాలైన స్పీడ్ కెమేరా, క్లోజ్డ్ సర్య్కూట్, టెలివిజన్ కెమేరా, స్పీడ్ గన్, బాడీ వేరిబుల్ కెమేరా, తదితర టెక్నాలజీ పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భధ్రతకు వాడుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు వాహనాన్ని నడిపేటప్పుడు తన ప్రాణాన్నే కాకుండా తన కుటుంబ సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాహనాన్ని నడపాలని దీనికి సంబంధించిన భధ్రత మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని, హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారణలో భాగంగా తనిఖీలు ముమ్మరం చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఆర్ టిఓ కె. శ్రీహరి మాట్లాడుతూ వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగివుండాలని, హెల్మెట్ ధరించివుండాలని, అతివేగాన్ని నియంత్రించుకోవాలని, వీటిని దిక్కరించి వాహన దారుడు ప్రయాణంచేస్తే కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Social Plugin