Ticker

6/recent/ticker-posts

రైతు సమస్యలపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌.. కీలక నిర్ణయం


రైతు సమస్యలపై ఫోకస్‌ పెట్టిన ఏపీ సర్కార్..
పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లపై కీలక నిర్ణయం..


ANDRAPRADESH, CHANDRA BABU NAYUDU: రైతు సమస్యలపై ఫోకస్‌ పెంచింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. తాజాగా పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పొగాకు రైతుల సమస్యలకు చెక్‌ పెట్టేందుకు మార్క్‌ ఫెడ్ నుంచి కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎఫ్‌సీవీ రకాన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనేది టొబాకో బోర్డు నిర్ణయించాలన్నారు సీఎం చంద్రబాబు. వైట్ బర్లీ పొగాకు రకాన్ని ఒప్పందం మేరకే సాగు చేయించి కంపెనీలే కొనుగోలు చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు మార్కెట్ యార్డులను పొగాకు కొనుగోళ్ల కోసం ఇప్పటికే సిద్ధం చేశారు. అన్ని రకాల పొగాకును కొనుగోలు చేసే విధంగా కంపెనీలతో అధికారులు సంప్రదింపులు జరపనున్నారు.. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయశాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.. మరోవైపు 43 వేల మెట్రిక్ టన్నుల మ్యాంగో పల్ప్ నిల్వలు ప్రాసెసింగ్ కంపెనీల దగ్గర నిలిచిపోయాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారులు కేజీ మామిడి 12 రూపాయలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యాపారులు కనీసం 8 రూపాయలు చెల్లిస్తే.. ప్రభుత్వం 4 రూపాయలు నేరుగా రైతులకే చెల్లించనుంది. అలాగే కోకో పంటకు కనీసం 500 రూపాయలు గిట్టిబాటు కల్పించేలా చూడాలని నిర్ణయించారు. తాజాగా సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు కొంతవరకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.