బీసీలే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలని ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో జరిగిన *జయహో బిసీ* కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. మండల టిడిపి బీసీ సెల్ ఆద్వర్యంలో జరిగిన జయహో బిసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వెన్నంటి వున్న బీసీలకు తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక రక్షణ చట్టంతో న్యానం చేస్తామని తెలిపారు.
వైసీపీ పాలనలో బీసీలపై జరుగుతున్న దాడులు దృశ్యా భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు పడకూడదనే చంద్రబాబు నాయుడు ఆలోచించి బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నారని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తమ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి పైనే గంజాయి బ్యాచ్ తో దాడి చేయించారని ప్రముఖ న్యూస్ ఛానల్ లో రావడం చూసామని తెలిపారు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటని కొత్తపేట ప్రజానీకం ప్రశ్నిస్తే వారిపై కూడా దాడి చేయించే పాలన కొత్తపేట నియోజకవర్గంలో తీసుకొస్తారని అందరూ అప్రమత్తంగా వుండాలని సూచించారు.
ప్రశాంతమైన మన కొత్తపేటలో ఇటువంటి రౌడీ రాజకీయాలు చేసే వైసీపీ పార్టీకి, స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి తగిన బుద్ది చెప్పి ఇంటికి పంపించే భాద్యత ప్రజలే తీసుకోవాలని సత్యానందరావు కోరారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర నూర్ భాషా సాధికార కమిటీ కన్వీనర్ షేక్ శుభాన్, రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, కొత్తపేట నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కాసా సాగర్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు అయినం నాగరాజు, ముదునూరి వెంకట్రాజు, యల్లమిల్లి జగన్మోహనరావు, రెడ్డి రామకృష్ణ, మిద్దె ఆదినారాయణ, రెడ్డి తాతాజీ, గుత్తుల పట్టాభిరామారావు, చిటికెన సత్యనారాయణ, జానా ఆంజనేయులు, మట్టా లక్ష్మీ వేంకటేశ్వరప్రసాద్, తీగిరెడ్డి నారాయణరావు, గుడేల నాగేంద్ర, కముజు వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి చిన్నారావు, కోట వెంకటేశ్వరరావు, బొక్కా వెంకట కుమార్, అత్తిలి వెంకటేశ్వరరావు, మిద్దె శ్రీరామ మూర్తి, వీరి గోపి, వాసంశెట్టి రామకృష్ణ, మానే గోవిందు, కట్టుంగ పుల్లయ్య, అంబుల శ్రీను, మజ్జి సూరిబాబు, వట్రపాటి మనోహర్, చింతా దుర్గారావు, అల్లు వెంకటరమణ, జానా గణేష్, మట్టా శ్రీను, రాలింగి సత్యనారాయణ, దేవగుప్తాపు వీరవెంకటసత్యనారాయణ, చింతా దుర్గారావు, గుదే బాలాజీకృష్ణ, దొమ్మేటి వెంకటేశ్వరరావు, కోమలి నాగ సత్యనారాయణ మరియు ఆత్రేయపురం మండల మరియు వసంతవాడ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు.
Social Plugin