దీంతో సీఐ దుర్గారావును హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. ఇదే కేసులో బొదన్ సీఐ ప్రేము కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ్ కుమార్ షకీల్ కొడుకు విదేశాలకు వెళ్లేందుకు సహరించినట్లు తెలిసింది. దుర్గారావును సస్పెండ్ చేసిన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. చిరవరికి దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద షకీల్ కొడుకు సోహెల్ నిర్లక్ష్యంగా అత్యంత వేగంగా కారు నడిపి బారికేడ్లను ఢీకొట్టాడు.
పంజాగుట్ సీఐ సోహెల్ కు బదులు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి సీఐని సస్పెండ్ చేశారు. 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సోహెల్ గతంలో కూడా రాష్ డ్రైవింగ్ చేసి ఒకరి మరణానికి కారణమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు షకీల్ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండడంతో సోహెల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
బేగంపేట ప్రజాభవన్ వద్ద సోహెల్ నిర్లక్ష్య డ్రైవింగ్ కేసులో పోలీసులు బలిపశువులుగా మారారు. దుర్గారావు షకీల్ చెప్పినట్లు వినడంతో మొదటికే మోసం అయినట్లు తెలుస్తోంది. కొంత మంది పోలీసులు అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు తొత్తులుగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత బుక్ అయి పోతారు.
Social Plugin