Ticker

6/recent/ticker-posts

మాస్టర్ ప్లాన్, కొడుకు కోసం అన్ని సెట్ చేస్తున్న సీఎం, సీఎంకు చెక్ పెట్టడానికి ప్రతిపక్షాలు స్కెచ్!


 సీఎం హోదాలో ఉన్న సిద్దరామయ్య ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తుపై ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారని వెలుగు చూసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి సిద్దరామయ్య కోసం ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర వరుణ అసెంబ్లీ నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. అయితే ఇప్పుడు తన కుమారుడు యతీంద్ర రాజకీయ భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాస్టర్ ప్లాన్ వేశారు.


లోక్‌సభ ఎన్నికల్లో మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తన కుమారుడు యతీంద్రను రంగంలోకి దింపాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆలోచిస్తున్నారు. మైసూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో సంప్రదించిన సీఎం సిద్దరామయ్య లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు యతీంద్రను ఎలా పోటీ చేయించాలి ? మీరు ఏం అంటారు ? అని వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారని వెలుగు చూసింది.


ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరు జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో సమావేశం అయ్యారు. మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన కులాల వారీగా లెక్కలు తెలుసుకున్నారని, ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు వస్తాయి, బీజేపీకి ఎన్ని ఓట్లు రావచ్చు, జేడీఎస్ ఓటు బ్యాంకు ఎంత అని గణాంకాలతో సహా సమాచారం అందించాలని సీఎం సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్ నాయకులకు సూచించారని సమాచారం.


ఇక యతీంద్ర పోటీ చేసే విషయంపై మైసూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సిద్ధరామయ్య కోరారు. ఇప్పటికే మైసూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి తన కుమారుడు యతీంద్రను పోటీకి సిద్ధం చేసిన సిద్ధరామయ్య మైసూరు-కొడగు జిల్లాల పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశారు. మైసూరు-కొడగు లోక్ సభ ఎన్నికలకు తన కుమారుడు యతీంద్ర పోటీ చేయించే విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సీఎం సిద్దరామయ్య సేకరించినట్లు సమాచారం.


లోక్‌సభ ఎన్నికల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలని సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను ఆదేశించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ తీరు ఎలా ఉంది? వాటి వివరాలను తనకు ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు. ఇప్పటికే మైసూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతల నుంచి సిద్ధరామయ్య స్వేచ్ఛగా అభిప్రాయాలు సేకరించారు. అయితే సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర పోటీ చేస్తే ఫలితాలు ఫర్వాలేదని ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే సిద్దరామయ్యకు చెప్పారని తెలిసింది.


సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర మైసూరు-కొడుకు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మైసూరు-కొడగు లోక్‌సభ నియోజక వర్గం సిట్టింగ్ బీజేపీ ఎంపీగా ఉన్న ప్రతాప్ సింహా ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని, ఆయన గెలుపు కోసం బీజేపీ, జేడీఎస్‌లు జతకట్టాయని, ఇలాంటి సమయంలో మీ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్రను పోటీకి దించి రిస్క్ తీసుకోవద్దని కొందరు ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు చెప్పినట్లు సమాచారం.