ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారని బడుగు బలహీన వర్గాలవారి అభ్యున్నతకు ఎంతో కృషి చేసారని కొనియాడారు. పేద ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారేనని అన్నారు, ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఆవిష్కరణ చేసి, పూలమాల వేసి ఘననివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు కొల్లూరి రాంబాబు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, స్థానిక వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Social Plugin